కార్మికులకు నూతన వస్త్రాలు అందజేసిన గుడివాడ పట్టణ ఆర్కే వారియర్స్

    గుడివాడ ( జనస్వరం ) :గుడివాడ పట్టణ స్థానిక ఎన్టీఆర్ స్టేడియం వర్కర్స్ కి నూతన వస్త్రాలు అందజేసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన గుడివాడ పట్టణ ఆర్కే వారియర్స్. ఈ సందర్భంగా సామాజికవేత్త డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే ఆలోచనతో స్టేడియంలో పని చేస్తున్న వర్కర్స్ కి మా వంతు సహాయంగా సంక్రాంతి పండుగ సందర్భంగా వారికి నూతన వస్త్రాలు అందజేయడం జరిగిందని అన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో అతి ముఖ్యమైన పండుగ సంక్రాంతి పండుగ అలాంటి పండుగ అందరి ఇళ్లల్లో సంతోషంగా చేసుకోవాలని ఆలోచనతో మనతోపాటు పొరుగువారు కూడా సంతోషంగా ఉండాలని ఆలోచనతో ఈరోజు వారికి నూతన వస్త్రాలు అందజేసామని అన్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా మన రాష్ట్రం లో ఉన్న వ్యవసాయదారులకు మంచి పంటలు పండి దిగుబడి వచ్చి సంతోషంగా ఉండాలని మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే రైతు సంతోషంగా ఉండాలని అలాంటి రైతులందరికీ భగవంతుని ఆశీస్సులు ఉండి వారికి మంచి దిగుబడి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో షేక్ మీరా షరీఫ్, నూనె అయ్యప్ప, గంట ఆంజనేయులు, చరణ్ తేజ్, దివిలి సురేష్, మరియు ఆర్కే వారియర్స్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way