పెందుర్తి నియోజకవర్గం విశాఖపట్నం జిల్లా యాసిడ్ బాధితురాలు అపర్ణ కుటుంబం ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించడంలో విఫలమైంది కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మండల పరిషత్ వద్ద 8 రోజు జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో జనరల్ సెక్రటరీ శ్రీ తమ్మి రెడ్డి శివ శంకర్ గారి పిలుపు మేరకు పెందుర్తి నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి మద్దతు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో 88 వార్డ్ కార్పొరేట్ అభ్యర్థి శ్రీ వబ్బిన జనార్దన శ్రీకాంత్ గారు మాట్లాడుతూ ఈ ఒక్క వైయస్ఆర్సీపీ ప్రభుత్వం మొద్దు నిద్ర వదలాలని పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అదీప్ రాజు గారు వెంటనే స్పందించి అపర్ణ కార్పొరేట్ వైద్యం అందించాలని కోరడం జరిగింది. 95 వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థి కంచిపాటి మధు మాట్లాడుతూ సమస్య ఎక్కడ ఉంటే అక్కడ జనసేన పార్టీ అండగా ఉంటుందని అదే స్ఫూర్తితో అపర్ణ కుటుంబానికి మా వంతు ఆర్థిక సాయం అందించామని ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలని అని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. సబ్బవరం మండల నాయకులు మామిడి శంకరరావు గారు మాట్లాడుతూ హాస్పిటల్లో వైద్యం చేయవలసిన అపర్ణ ఆర్థిక స్థోమత లేక గత మూడు నెలల నుంచి ఇంటి వద్ద ఉందని రేపు అపర్ణ ప్రాణాలు వదిలిన అట్లయితే ఈ యొక్క ప్రభుత్వం బాధ్యత వహించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎస్.కోట నియోజకవర్గం నాయకులు వబ్బిన సతీష్ గారు మాట్లాడుతూ రెండు రోజులో అపర్ణ కు కార్పొరేట్ వైద్యం అందిస్తాం అని చెప్పిన పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే నెల రోజులు గడుస్తున్నా కుటుంబం చేస్తున్న స్పందన కరువైందని పెందుర్తి ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి అపర్ణ సమస్యను మీయొక్క ప్రభుత్వ పెద్దల వద్దకు తీసుకుని వెళ్లి మరుగైన వైద్యం అందించడంలో చొరవ తీసుకోవాలని కోరడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో నాయకులు మెండ సతీష్ గారు మోటూరు చైతన్య గారు, నల్ల వలస శ్రీను గారు, అల్లా వాణి, రాజు కరణం మధు, మరియు ఎమ్మార్పీఎస్ నాయకులు కంటి పాక త్రిమూర్తులు కొత్తలంక కనకరాజు పెంటయ్య ఏసుదాసు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com