Logo
Date of Publish : 12 January 2022, 3:39 am
Editor : Sake Naresh

ఘనంగా జనస్వరం క్యాలెండర్ ఆవిష్కరణ

- జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ చేతుల మీదుగా ఆవిష్కరణ
- విజయవాడ నగర 47వ డివిజన్ అధ్యక్షుడు గౌరీ శంకర్, 52వ డివిజన్ అధ్యక్షుడు కనకరావు, జనసైనికులు
     విజయవాడ, (జనస్వరం) : జనస్వరం క్యాలెండర్ ను జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ చేతుల మీదుగా వారి పార్టీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జనస్వరం పత్రిక ద్వారా ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని, అందులో వారు వారి వంతు కృషిగా ముందుకు సాగాలని అన్నారు. బెజవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులు పత్రికపై సంపూర్ణంగా ఉండాలని అన్నారు. అదేవిధంగా జనస్వరం పాఠకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న రోజుల్లో ప్రజలందరికీ సమాచారం అందించే విధంగా చాలా వేగంగా ప్రజలందరికీ సమాచారం అందించే విధంగా కృషి చేయాలని ఆయన అన్నారు. క్యాలెండర్ డిజైన్ లో పార్టీ సిద్ధాంతాలు, పార్టీ చేపట్టిన కార్యక్రమాలు, పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ చిరు నవ్వుతో ఉన్న డిజైన్ చూపరులను ఆకర్షిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. 47వ డివిజన్ పార్టీ అధ్యక్షుడు గౌరీ శంకర్ మాట్లాడుతూ జనస్వరం పత్రిక ప్రజల్లోకి బలంగా వెళ్ళాలని, అందుకు కావాల్సిన తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. 52వ డివిజన్ పార్టీ అధ్యక్షుడు కనక రావు మాట్లాడుతూ రాష్ట్రంలో జనసేన పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జనస్వరం చేస్తున్న కృషి వెలకట్టలేనిది అని అన్నారు. అనంతరం మధన్ కుమార్ మాట్లాడుతూ జనస్వరం మీడియా ప్రజా సమస్యపై బలంగా పోరాడాలని కోరారు. జనస్వరం ప్రతినిధి సాయికల్యాణ్ మాట్లాడుతూ క్యాలెండర్ ఆవిష్కరణకు విచ్చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. జనస్వరం అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అరవింద్, హేము, శ్రీను, చిరంజీవి, పండు, మోహన్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com