
అమరావతి, (జనస్వరం) : రాజధాని రైతులు చేపట్టిన పాదయాత్ర వార్తలను కవర్ చేసేందుకు వెళ్తున్న మీడియా ప్రతినిధులను పోలీసులు అడుగడుగునా అడ్డుకోవడం మీడియా స్వేచ్ళను హరించడమే. పాదయాత్రకు సంబంధించిన వార్తలు, విజువల్స్ సేకరించాల్సిన అవసరం లేదని బాధ్యత కలిగిన పోలీసు ఉన్నతాధికారులే చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. మీడియా ఏం చేయాలో కూడా వైసీపీ ప్రభుత్వమే చెబుతూ, పాత్రికేయులను నియంత్రించడం కచ్చితంగా నియంతృత్వ పోకడే. ప్రకాశం జిల్లాలో సాగుతున్న రైతుల పాదయాత్రను కవర్ చేసేందుకు వెళ్ళిన మహా టీవీ ఎమ్.డి.. పాత్రికేయుడు శ్రీ వంశీని, పలువురు విలేకర్లను పోలీసులు అడ్డుకొని విధులకు ఆటంకం కలిగించడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. పాత్రికేయులపై ఆంక్షలు విధించడం మానుకోవాలి.