పాలకొండ ( జనస్వరం ) : జనసేన పార్టీ నాయకులు గర్భాన. సత్తిబాబు, మరియు కూరంగి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మురికి కాలువ సమస్య పై పాలకొండ మండలం వడమ కాలనీ లో చెరువుకు అనుకొని తూర్పు భాగంలో ఉన్న 7వ వార్డులో బలివాడ.సాయి ఇంటి దగ్గర నుండి నివసిస్తున్న గృహస్థుల ఇండ్ల నుండి వచ్చే మురికి నీరు, వర్షం నీరు మరియు డ్రైనేజ్ వాటర్ పోయేందుకు “కాలువ” లేని కారణంగా అక్కడ మురికి నీరు నిలవగా ఉండిపోవడంతో ఆ వీధిలో, ఉన్న ప్రజలు టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, ఇలా రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. దోమల సమస్య కూడా తీవ్రంగా ఉండటంతో ప్రజలకు అనారోగ్య పరిస్థితులు ఎక్కువ అవుతున్నాయి. మరియు అంగన్వాడి బిల్డింగ్ కూడా మునిగిపోయినందున వేరే దగ్గర బిల్డింగ్ అద్దెకు తీసుకుని అంగన్వాడి సెంటర్ నడుపుతున్నారు. కావున ఇక్కడ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, RDO వారికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా RDO వారు పరిశీలించి తగు చర్యలు వెంటనే తీసుకోవాలని సత్తిబాబు కోరారు. వెంటనే చర్యలు తీసుకుంట