రాజంపేట ( జనస్వరం ) : జిల్లాలోని టి.సుండుపల్లి మండల పరిధిలో ఇటీవల కాలములో కుప్పగుట్టపల్లి గ్రామములో బోరుబావిలోపడి వ్యవసాయ ఆధారిత రైతు బయటికి రాలేని పరిస్థితిలో మరణించడం జరిగింది.ఈ వార్త మండలములోని ప్రజలకు తీవ్రమనోవేధనను మిగిలించిందని జనసేన నాయకులు రామశ్రీనివాసులు అన్నారు. ఇలాంటి బోరుబావులు మండలములోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో నిరుపయోగములేని, బోరువేసి నీళ్ళుపడని బోరుబావులను, పెద్దగుంతలను రెవెన్యూ, మున్సిపాలిటీ, పంచాయితీ అధికారులచే గుర్తించి భవిషత్తులో ఎవరికి ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా నివారించగలిగితే ప్రభుత్వము తరపున నస్టపరిహారం చెల్లించడం అవసరం ఉండదన్నారు. పోలీసు, రెవెన్యూ, మునికిపాలిటీ, పంచాయితీ మొదలగు శాఖలవారిని అప్రమత్తం చేసినచో బోరుబావిలో పడిన తర్వాత వచ్చే అధికారులకు వ్యయప్రయాసలు, ప్రజలు బోరుబావుల ద్వారా ప్రాణ నష్టాలు మరియు సమస్యల బారిన పడకుండా చూడాలన్నారు. సంభంధిత అధికారులు ద్వారా తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని, అలాగే ఉపయోగంలో ఉన్న బోరుబావులకు రక్షణగా గోడలను, కంచేలను నిర్మించుకొనులాగా బోరుబావుల రైతులను, యజమానులను చైతన్యపరచి, గడువుతో కూడిన నోటీసుల ద్వారా తెలియజేసి తగు చర్యలు, సూచనలు సంభంధిత అధికారుల చేత అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో అప్రమత్తం చేయగలరని జనసేన పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com