శృంగవరపుకోట మండలం తిమిడి గ్రామంలో గత ఎన్నో ఏళ్లుగా దాదాపు 30 కుటుంబాలకు ఊరులోకి వెళ్లిరావటానికి వీలుగా ఉన్న రోడ్డు ని స్థానిక మిల్లు యజమాని ఆక్రమించి రోడ్డు కి అడ్డంగా గోడ నిర్మించారని స్థానిక జనసేన నాయకులు ఆరోపించారు. కావున తహసీల్దార్ వారు వెంటనే స్పందించి మార్గము చూపించాలని కోరారు. అలాగే నిత్యం వాడుకలో ఉన్న బోరింగ్ వెళ్లే మార్గం కూడా సరిగా లేదని వాపోయారు. స్థానిక ప్రజలు జనసేన శృంగవరపుకోట నియోజకవర్గం నాయకులు శ్రీ వబ్బిన సన్యాసినాయుడు గారి ఆధ్వర్యంలో తహసీల్దార్ శ్రీ రామారావు గారికి అలాగే ఎస్.కోట ఎస్. ఐ శ్రీ నీలకంఠ గారికి వినతిపత్రం అందించటం జరిగింది. అధికారులు స్పందించి సమస్యలను చూసి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.