Logo
Date of Publish : 27 January 2022, 10:29 am
Editor : Sake Naresh

జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన మహేష్ అధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

   విజయవాడ, (జనస్వరం) : గణతంత్ర దినోత్సవ వేడుకలను 53వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో తమ్మిన గురవమ్మ సత్రం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జ్ పోతిన వెంకట మహేష్ జండా వందనం చేసిన అనంతరం మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం, లౌకికతత్వం, న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందడం జరిగిందని, విదేశీ పాలన పూర్తిగా అంతరించి అధికారాన్ని అప్పగించిన గుర్తులే గణతంత్ర దినోత్సవం అన్నారు. ఏపీలో వైయస్ జగన్ పాలనలో రాజ్యాంగ స్ఫూర్తి పూర్తిగా దెబ్బతింటుందన్నారు. ఈ పాలనలో సంస్కృతి సాంప్రదాయాలు సర్వనాశనం అవుతున్నాయని గణతంత్ర దినోత్సవ వేడుకల్లో శకటాలు ప్రదర్శించినంత మాత్రాన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతున్నట్ల కాదని, వాస్తవ కోణంలో గుడివాడలో సంస్కృతి సాంప్రదాయాలు సర్వ నాశనం చేస్తూ క్యాసినోవా సెంటర్లో ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకొని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రేకపల్లి శ్రీను, తమ్మిన బాబి, మోహన్ రావు, స్టాలిన్, నల్లబెల్లి కనకారావు, ఉమామహేశ్వరరావు సోమశేఖర్, మదన్ కుమార్, శివ, రాము, రమణారెడ్డి, నూకరాజు, మూర్తి, పండు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com