Search
Close this search box.
Search
Close this search box.

కూకట్ పల్లి జనసేనపార్టీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

    హైదరాబాద్, (జనస్వరం) : కూకట్ పల్లి జనసేన పార్టీ ఆధ్వర్యంలో రమ్య గ్రౌండ్ మరియు టెంపుల్  బస్ స్టాప్ వద్ద 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకోని జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జెండా వందనం అనంతరం ఈ సందర్భంగా 114 డివిజన్ ప్రెసిడెంట్ కొల్లా శంకర్, 115 డివిజన్ ప్రెసిడెంట్ దుర్గా శ్రీనివాస్ ఇరువురు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల పుణ్య ఫలం ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వతంత్రం అని అలాగే డా. బి ఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా ఈ రోజు ఆయన అడుగుజాడల్లో నడుస్తూనే ఆయన ఆశయాలను నేరవేర్చే దిశగా యువత ముందుకు వెళ్లాలని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కుకట్ పల్లి నియోజకవర్గ నాయకులు 114 డివిజన్ కొల్లా శంకర్, 115 ప్రెసిడెంట్ దుర్గా శ్రీనివాస్, 115 ప్రధాన కార్యదర్శి తుమ్మల మోహన్ కుమార్, 114 డివిజన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సత్యనారాయణ మరియు జనసైనికులు అంజి ( కేబుల్), సత్యనారాయణ, ఉదయ్, శంకర్, నాగరాజు, వెంకటేశర రావు, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way