
రాజాం, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో బుచ్చింపేట గ్రామ యువత ఆధ్వర్యంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో యు.పి.రాజు పాల్గొని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి జెండాకు వందనం చేశారు. అనంతరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాజాం స్థానిక చెవిటి మూగ పాఠశాల లో ఉన్న విద్యార్థులుకు పండ్లు పంపిణీ చేశారు. రాజాం నియోజకవర్గ నాయకులు యు.పి.రాజు మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర్య సమర యోధులు, అమర వీరుల ఫలితమే భారతీయుల స్వేచ్ఛ. వారి స్ఫూర్తితో ముందుకు సాగుదాం అని, స్వేచ్ఛాయుత భారతంలో అభివృద్ధి అన్ని వర్గాలకు చేరువ కావాలని, రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించేలా ప్రజలందరూ భాద్యత తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు జగదీశ్వర్ రావు, సామంతుల రమేష్,గోవింద్ రావు, దుర్గారావు, రామకృష్ణ, సాయి తదితరులు పాల్గొన్నారు.