పాలకొండ ( జనస్వరం ) : వీరఘట్టం మండలంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నడుకురు గ్రామములో 74 వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స పుండరీకం మాట్లాడుతూ మన భారత దేశంలో 1950వ జనవరి 26న భారత రాజ్యాంగం వచ్చింది. స్వాతంత్రం 1947 ఆగస్టు 15 లో వచ్చినప్పటికీ కూడా మన భారతదేశానికి రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన సాగే విధంగా లేకపోవటం వల్ల 1950లో భారత రాజ్యాంగపరంగా చట్టాన్ని జనవరి 26 భారతీయ జాతీయ జెండాను ఎగరవేస్తూ ఉన్నాము. మన భారతదేశానికి మహనీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు గాంధీజీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, మరియు చాలామంది నాయకులు పాల్గొని మనకు ఈ రోజున స్వేచ్ఛ కల్పించినటువంటి రోజు గణతంత్ర దినోత్సవం. మన ఆంధ్రప్రదేశ్ లో మారుమూల ప్రాంతమైన ఆదివాసిలు నివసించే గిరిజన ప్రాంతంలో గాని, మైదాన ప్రాంతాల్లో ఇప్పటికీ బ్రిటిష్ పరిపాలన లాగే ఉంది. రాజ్యాంగం కల్పించిన చట్టాలు ఉల్లంఘిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైస్సార్సీపీ పరిపాలన సాగుతుంది. కావున మన హక్కులను మన చట్టాలను మనం కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆంధ్రప్రదేశ్ కి నిజమైన గణతంత్ర రావాలంటే రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చింత గోవర్ధన్ నాయుడు, కంటు రాంబాబు, కింజంగి సాయి, వాన మహేష్ తదితరులు పాల్గొన్నారు.