బాపట్ల, (జనస్వరం) : బాపట్ల నియోజకవర్గం జనసేనపార్టీ కార్యాలయంలో 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాని ఎగరవేసి రాజ్యాంగ పరిషత్ కమిటీకి, రాజ్యాంగ రచన ముసాయిదా కమిటీకి, స్వాతంత్ర సమరయోధులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాపట్ల నియోజకవర్గ ప్రజలకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రభుత్వ అధికారులకు, మీడియా మిత్రులకు 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సిద్ధించింది. జనవరి 26, 1950 న భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించిన రోజు. ఆ రోజు నుండి బ్రిటీష్ కాలంనాటి భారత ప్రభుత్వ చట్టం -1935 రద్దయ్యింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శినికులు, మేధావులు రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటుచేశారు. దీనికి అధ్యక్షుడిగా డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ గారును ఎన్నికోగా, రాజ్యాంగ రచనా ముసాయిదా కమిటీ ఛైర్మన్‌గా డాక్టర్ B.R.అంబేడ్కర్ గారిని నియమించారు. వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26నే ఆమోదించారు. జనవరి 26 1950లో భారతదేశ రాజ్యాంగాన్ని అమలు తీసుకొచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ, గుంటూరు జిల్లా కార్యదర్శి గుంటుపల్లి తులసి కుమారి, సంయుక్త కార్యదర్శి నామన వెంకట శివన్నారాయణ, కర్లపాలెం మండలం అధ్యక్షులు గొట్టిపాటి శ్రీకృష్ణ, మరియు జనసేన నాయకులు & జనసైనికులు పాల్గొన్నారు.