తాడిపత్రి ( జనస్వరం ) : 74 గణతంత్ర దినోత్సవ సందర్బంగా తాడిపత్రిలో జెడ్‌పిహెచ్‌ఎస్ పాఠశాల నందు జనసేన నాయకులు, రాష్ట్ర చిరంజీవి యువత తరపున కార్యక్రమం చేయడం జరిగింది. విద్యార్థులకు ఆటలపోటీలు పెట్టారు. గెలిచిన వారికి మెడల్స్ మరియు గిఫ్ట్‌లు రాష్ట్ర చిరంజీవి యువత పట్టణ అధ్యక్షులు, జనసేన నాయకులు ఆటో ప్రసాద్ గారు ఇవ్వడం జరిగింది. ఆయన మాట్లాడుతూ తెల్లదొరల పాలన నుండి విముక్తి పొంది, దేశానికి స్వాతంత్య్రం వచ్చిందనే భ్రమలో ఈ దేశ ప్రజలు జీవిస్తున్నారు.. కానీ నేడు దేశంలోడా.బి.ఆర్.అంబేద్కర్ రాసిన రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ నేటి నల్లజాతి పాలకులు నియంత పాలన అందిస్తున్నారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, ప్రజల హక్కు కాలరాస్తు ప్రజల సంపదను కొల్లగొడుతూ వారి స్వేచ్ఛ స్వాతంత్రం లేనటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నారన్నారు. నేటి విద్యార్థులే రేపటి పౌరులు అని చెప్తూ దేశ అభివృద్ధి యువత చేతులోనే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల టీచర్లు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com