Logo
Date of Publish : 22 October 2021, 5:06 pm
Editor : Sake Naresh

మహా పాదయాత్రకు శ్రీ పవన్‌ కళ్యాణ్ గారి మద్దతు కోరిన అమరావతి రాజధాని రైతుల ప్రతినిధులు

    మంగళగిరి, (జనస్వరం) : ఆంధ్ర ప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని పరిరక్షించాలని కోరుతూ నవంబర్‌ 1వ తేదీ నుంచి చేపట్టీ మహా పాదయాత్రకు మద్దతు తెలియచేయాలని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారిని అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి కోరాయి. ఈ మేరకు శుక్రవారం ఉదయం జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ శ్రీ నాదెండ్ల మనోహర్‌ గారిని కలిశారు. తాము చేపడుతున్న మహాపాదయాత్ర వివరాలను తెలియచేశారు. 45 రోజులపాటు సాగే ఈ మహా పాదయాత్ర తుళ్ళూరు గ్రామం నుంచి తిరుమల వరకూ సాగుతుందని వివరించారు. డిసెంబర్‌ 17వ తేదీతో ముగుస్తుందని తెలిపారు. దాదాపు రెండేళ్లుగా దీక్షలు చేస్తున్నామని, అమరావతి పరిరక్షణలో భాగంగా మహా పాదయాత్ర తలపెట్టామన్నారు. ఈ సందర్భంగా రాజధాని కోసం రైతులు, ఆ ప్రాంత ప్రజలు చేస్తున్న పోరాటానికి శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాజధాని విషయంలో అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి చేపట్టిన మహా పాదయాత్ర విజయవంతం కావాలని శ్రీ నాదెండ్ల మనోహర్‌ గారు ఆకాంక్షించారు. ఈ సమావేశంలో అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్‌ శ్రీ ఎ.శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీ తిరుపతిరావు, రాజధాని ఐకాస కార్యదర్శి శ్రీ బెజవాడ రమేష్‌, సభ్యులుశ్రీ కొండేపాటి సతీష్‌ (బుజ్జి), శ్రీ శ్రీధర్‌ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com