Logo
Date of Publish : 03 February 2024, 8:01 pm
Editor : Sake Naresh

వైసీపీ పార్టీ నుంచి 100 కుటుంబాల ప్రతినిధులు జనసేనలో చేరిక

    చంద్రగిరి ( జనస్వరం ) : జనసేన ఇంఛార్జి దేవర మనోహర  ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి జాయిన్ అయ్యారు. సి.కే పల్లి పంచాయతీలోని చిట్టత్తురు గ్రామానికి చెందిన పురుషోత్తం నేతృత్వంలో మండల అధ్యక్షులు సంజీవి హరి గారి అధ్యక్షతన దాదాపు 100 కి పైగా కుటుంబాల ప్రతినిధులు, అధికార వైసిపి పార్టీ నుండి జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. దేవర మనోహర మాట్లాడుతూ పల్లెట్టూర్లు, పట్టుగూడ్లని అలాంటి పల్లెటూరులో కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేని ఎమ్మెల్యే చెవిరెడ్డి గారు ఎమ్మేల్యే గా కొనసాగే అర్హతే లేదన్నారు. పబ్లిసిటీ మీద పెట్టే శ్రద్ధ ప్రజల కష్టాలపై పెడితే వారి జీవితాలు బాగుపడతాయని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో ఇప్పటికే చాలామంది జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ప్రతి నిత్యం ఎక్కడో ఒక చోట వందలకొద్దీ పార్టీలో చేరడం శుభపరిణామం అని అన్నారు. అలాంటిది చంద్రగిరిలో ఈ చేరికలు చూస్తున్నట్లయితే నియోజకవర్గంలో అభివృద్ధిపై ఆశలు చిగురింపజేస్తున్నయని రేపు రాబోయే ఎలక్షన్లలో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం కూడా ఖాయమని అన్నారు. ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో ముందుకు వచ్చి జనసేనతో ప్రయాణించాలని ఈ రాష్ట్ర దశా దిశా మార్చే నాయకుడి వెంట నడవాలని పిలుపునిచ్చారు. అలాగే రానున్న రోజుల్లో చంద్రగిరి నియోజకవర్గంలో భారీ చేరికలు ఉంటాయని, నియోజకవర్గంలోని ఇతర పార్టీ కీలక నేతలు, ప్రముఖులు చేరుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, యువ నాయకులు పగడాల యువరాజ్ రాయల్,  తపసి మురళి రెడ్డి, నూనె దిలీప్, గుర్రప్ప, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com