- షోకాజ్ నోటీస్ అంటూ తప్పుడు ప్రచారం
- పత్రికాప్రకటన విడుదల చేసిన జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్
తిరుపతి ( జనస్వరం ) : కుప్పంలో జరిగిన ఘటనపై పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు నివేదిక సమర్పించామన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. ఈ మేరకు బుధవారం ఆయన ఓ పత్రికాప్రకటన విడుదల చేశారు. జనసేన పార్టీ అధిష్టానం తనకు షోకాజ్ నోటీసు ఇచ్చినట్టు కొందరు పనిగట్టుకొని మరీ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కుప్పంలో ఏం జరిగింది? అన్నదానిపై మూడు అంశాలపై నివేదికను మాత్రమే కేంద్ర కార్యాలయం అడిగిందని చెప్పారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేన, టిడిపి పొత్తును జీర్ణించుకోలేక కొందరు పనిగట్టుకొని మరీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. మీడియాలో వార్త రాసే ముందు వివరణ కోరి ఉంటే బాగుండేదని అభిప్రాయ పడ్డారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com