రేపల్లె, (జనస్వరం) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా చేసిన దళిత నేత స్వర్గీయ శ్రీ దామోదరం సంజీవయ్యగారి శతజయంతి ఉత్సవాలలో భాగంగా జనసేనపార్టీ ఆధ్వర్యంలో రేపల్లె నియోజకవర్గ పరిధిలో చెరుకుపల్లిలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగాచేసిన మొట్టమొదటి దళిత నేత శ్రీ దామోదరం సంజీవయ్యగారు. ఆయన హయాంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి ఆరులక్షల ఎకరాలు భూమిని పంచిన మహనీయుడు, చిన్న తరహా పరిశ్రమలు స్థాపనకు శ్రీకారం చుట్టిన ఆశావాది, లక్షలమంది కార్మికులకు బోనస్ కల్పించిన కార్మికనేత, వృద్దులకు పెన్షన్లు ప్రవేశ పెట్టిన మానవతావాది సంజీవయ్యగారు అని కొనియాడారు. ఆయన ముఖ్యమంత్రిగా నీతినిజాయతిగా సేవలందించిన మహనీయుడు కాబట్టే ఆయన ఆశయాలను కొనసాగించడానికే పవన్ కల్యాణ్ గారు జనసేన పార్టీ తరుపున పోరాటం చేస్తున్నారని అన్నారు. జిల్లా కార్యదర్శి మత్తే భాస్కరరావు మాట్లాడుతూ దామోదరం సంజీవయ్యగారు ముఖ్యమంత్రిగా నీతినిజాయతిగా పనిచేసి ఆదర్శంగా నిలిచారు. ఆయన హయాంలో కాపులు పడుతున్న ఇబ్బందులు చూసి వారికి రిజర్వేషన్లు అవసరమని భావించి పునరుద్ధరణ చేసిన మహనీయుడు అని కొనియాడారు. జిల్లా సంయుక్తకార్యదర్శి చందోలు ప్రసాద్ మాట్లాడుతూ దళితులకు ఆయన జీవితం ఆదర్శంగా తీసుకుని జీవించాలని ఆకాంక్షించారు. ఆయన హయాంలో ఎస్సీ ఉధ్యోగులు రిజర్వేషన్లలో ప్రమోషన్ కల్పించిన మహనీయుడు అని కీర్తించారు. ఈ కార్యక్రమంలో గూడపాటి శ్రీనివాసరావు, చేనేత నాయకులు కాజా నాగేశ్వరరావు, కూనపరెడ్డి జగధీష్, కొమ్మూరి శ్రీనివాసరావు, తాతా పోలేరయ్య, మొగలిపూవు నాగేశ్వరరావు, యాజలి నాగేశ్వరరావు, ఉల్లంగుంట శ్రీనివాసరావు, నారిశెట్టి కృష్ణయ్య, చింతారేణుకారాజు, గాదె లక్ష్మణరావు, వినయ్, రేపల్లె నియోజకవర్గ జనసైనికులు పాల్గొన్నారు.