Logo
Date of Publish : 19 December 2022, 4:30 pm
Editor : Sake Naresh

టి.సి.వరుణ్ ఆధ్వర్యంలో శిథిలమైన గుంతల రహదారులకు మరమ్మత్తులు

      అనంతపురం ( జనస్వరం ) : జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో అనంతపురం జిల్లా అధ్యక్షులు, అర్బన్ నియోజకవర్గం ఇంచార్జ్ టిసి ఆధ్వర్యంలో చేపట్టిన శ్రమదానం ద్వారా గుంతలు పడ్డ రహదారుల మరమ్మత్తు కార్యక్రమానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. 5వ రోజు ఆదివారము అనంత అర్బన్ నియోజకవర్గం పరిధిలోని 50వ డివిజన్, సైఫుల్ల బ్రిడ్జ్ ఇరువైపుల, శ్రీ కంఠం సర్కిల్, సూర్య నగర్ లోని మెయిన్ రోడ్డు ప్రాంతాలలో శిధిలమైన రహదారులకు జనసేన నాయకులు కంకర పొడి సిమెంట్ వేసి గోతులను పూడ్చి చదును చేశారు. సంవత్సరాల తరబడి గుంతలు పడ్డ రోడ్లపై ప్రయాణం చేయలేక ఇబ్బంది పడ్డామని... ఫోన్ చేసిన 24 గంటల్లోనే జనసేన నాయకులు స్పందించి రహదారులు బాగు చేయడం పట్ల స్థానికులు, ఆర్టీసీ బస్సు డ్రైవర్లు, వాహనదారులు అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అర్బన్ ఇంచార్జ్ శ్రీ టి.సి.వరుణ్ గారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య గార్లు మాట్లాడుతూ... నగర ప్రజలకు ఏ సమస్య వచ్చినా జనసేన పార్టీ ముందుండి పోరాడుతుందన్నారు. అర్బన్ ఇంచార్జ్ శ్రీ టి.సి.వరుణ్ గారి నాయకత్వంలో శ్రమదానం కార్యక్రమాన్ని మరింత విస్తృతస్థాయిలో నిర్వహించి కళ్ళుండి కూడా చూడలేని ఈ వైసిపి ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామన్నారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి అవుకు విజయ్ కుమార్, నగర ప్రధాన కార్యదర్శులు మేదర వెంకటేష్, దరాజ్ భాష, నగర కార్యదర్శిలు విశ్వనాథ్, మురళి, సంపత్, నెట్టిగంటి హరీష్, పవన్, కార్యక్రమాల కమిటీ సభ్యులు సంతోష్ కుమార్, నాయకులు పవనిజం రాజు, శ్రీనివాస్, వడ్డే వెంకటేష్, నజీమ్, హిద్దు, నౌషాద్, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com