విజయవాడ, (జనస్వరం) : విజయవాడ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో స్పందనలో భాగంగా విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ కి రోడ్ల మరమ్మతులు చేయాలని నూతన రోడ్ల నిర్మాణం చేపట్టాలని జనసేన పార్టీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ నగరంలోని ప్రధాన రహదారులు, అంతర్గత రహదారులకు మరమ్మతులు చేపట్టి నూతన రోడ్ల నిర్మాణాన్ని చేయాలని కోరారు. రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న విజయవాడ నగరానికి నిత్యం లక్షలాది మంది ప్రజలు అనేక అవసరాల నిమిత్తం వచ్చి వెళుతూ ఉంటారు. రాజధాని నగరం అయినందున ఈ నగరం యొక్క పేరు ప్రతిష్టలను పెంచవలసినటువంటి బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. ముఖ్యంగా విజయవాడ నగరంలోని ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లు తీవ్రంగా దెబ్బతిని గోతులమయంగా మారాయని తెలియజేసారు. ప్రజలు గోతులు పడ్డ రోడ్ల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే రోడ్లకు మరమ్మతులు చేయించి అవసరమైన ప్రతి ప్రాంతం నందు నూతన రోడ్ల నిర్మాణం చేపట్టవలసిందిగా కోరుతున్నామన్నారు. సెప్టెంబర్ 2, 3, 4 తేదీల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు విజయవాడ నగరంలో అనేక ప్రాంతాల్లో జనసేన పార్టీ నాయకులు రోడ్లను పరిశీలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అనేక ప్రాంతాల్లో రోడ్లు పాక్షికంగా, పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులను గమనించినట్లు తెలియజేశారు. అదే విధంగా ఆయా ప్రాంతాలను సందర్శిస్తూ ప్రజల ఇబ్బందులను తెలియజేశారు. గోతులు పడ్డ రోడ్ల వల్ల వాహనాలు పాడైపోతున్నాయని, నీరు నిలిచి పోయినప్పుడు ప్రమాదాలు సంభవిస్తున్నాయని, ఆటోలు నడపడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వేగంగా రహదారుల మరమ్మతులు చేపట్టి అవసరమున్న ప్రతిచోట కూడా నూతన రోడ్ల నిర్మాణం తక్షణమే చేపట్టవలసిందిగా కోరుతున్నామన్నారు. అధికార పార్టీ నాయకులు విజయవాడ నగరంలో 600 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేపడుతున్నామని పదేపదే చెబుతున్నారని.. గోతులు పడ్డ రోడ్లకు మరమ్మతులు చేపట్టేందుకు ముందుకు రాని అధికార పార్టీ నాయకులు విజయవాడ నగర అభివృద్ధి ని ఏ విధంగా చేస్తారో ప్రజలకు, జనసేన పార్టీ నాయకులు కూడా సందేహంగా ఉందన్నారు. నిజాయితీ గలిగిన అనుభవం ఉన్నటువంటి యువ ఐఏఎస్ అధికారిగా ఉన్న మీరు తప్పక ప్రజల ఇబ్బందులను వెంటనే పరిగణలోకి తీసుకొని రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని కోరారు.
సమస్యగా ఉన్న రోడ్ల వివరాలు :
నెహ్రూ బొమ్మ సెంటర్ నుంచి చిట్టినగర్ ప్రాంతం వరకు, సితార సెంటర్ కూడలి వద్ద, విద్యాధరపురం ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్, చర్చి సెంటర్ వద్ద నుండి 16 అంతస్థుల బిల్డింగ్ ఊర్మిళ నగర్ సెంటర్ వరకు, కరెంట్ ఆఫీస్ రోడ్డు, అరండల్ పేట, సత్యనారాయణపురం, గుణదల, బెంజ్ సర్కిల్ వద్ద వి గ్రిల్ రోడ్డు, ఐదో నెంబర్ రూట్, సింగ్ నగర్ ప్రధానంగా తమ దృష్టికి తీసుకు వస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన విజయవాడ నగర ఉపాధ్యక్షులు వెన్న శివశంకర్, కార్యదర్శులు వెవిన నాగరాజు, కొరగంజి వెంకటరమణ, ధార్మిక మండలి సభ్యులు తమ్మిన రఘు, బొలిశెట్టి వంశీ, కోపిశెట్టి వెంకటేశ్వరరావు, పొట్నురి. శ్రీను, కె.సాంబ, పీ.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com