Logo
Date of Publish : 09 June 2022, 3:34 pm
Editor : Sake Naresh

రోడ్డును బాగు పరచండి మహాప్రభో ??? : భైరవ ప్రసాద్

          కదిరి ( జనస్వరం ) :  కదిరి నియోజకవర్గంలోని ఎన్ పి కుంట మండలం నందు కదిరి- రాయచోటి రోడ్డు నుంచి వంకమద్ది మీదుగా పెద్ద రాంపల్లి వరకు దాదాపు ఆరు కిలోమీటర్ల రోడ్డు గత 2019 సంవత్సరంలో రోడ్డు శాంక్షన్ అయింది. ఆ రోడ్డుపై గత సంవత్సరము కిందట కంకర పరిచి ఎటువంటి పనులు చేయకుండా అలాగే వదిలేశారు. దీనితో నాలుగైదు గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అక్కడి ప్రజలు మోటార్ సైకిల్ పై గాని, ఆటోలలో గాని పోవడానికి కూడా చాలా ఇబ్బంది కరం. ఎవరికైనా ఏదైనా ఆరోగ్యపరంగా ఇబ్బంది తలెత్తితే వారి బాధలు వర్ణనాతీతం. ఇదే మండల ఎంపీపీది కూడా అదే ఊరు. ఆయన కూడా అదే రోడ్డు పై మా ఎదురుగానే నానా తంటాలు పడుతువెళ్ళాడు. కాబట్టి ఎమ్మెల్యే గారు ఒక్కసారి ఆ గ్రామాల్లోకి వెళ్లి మీరు ఎంపిక చేసుకున్న వారికి మీకు డబ్బులు వచ్చిందా అని అడగకుండా, గ్రామాల్లో ప్రజలందరికీ మీకు రోడ్లు బాగున్నాయా, తాగునీరు వస్తోందా, కాలువలు, గిట్టుబాటు ధరలు అని అడిగితే చెప్తారు. ఎమ్మెల్యే గారు ఒక్కసారి ఆ రోడ్డుపై వెళ్లి, రోడ్డు పరిశీలించి చూసి రోడ్డు పనిని పూర్తి చేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అన్నారు. ఇలాగే రోడ్డు వదిలేస్తే అక్కడి ప్రజలే మీకు బుద్ధి చెబుతారని జనసేన పార్టీ ఇంచార్జ్ భైరవప్రసాద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల కన్వీనర్ మేకలచెరువు చౌదరి, జిల్లా కార్యక్రమాల కమిటీ సభ్యులు కుట్టాల లక్ష్మణ్, భాస్కర్, చక్రధర్ పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com