Logo
Date of Publish : 16 December 2022, 3:56 pm
Editor : Sake Naresh

రాయచోటి పట్టణాన్ని బాగు చేయండి : జనసేన నాయకులు రామా శ్రీనివాస్

      రాయచోటి టౌన్, (జనస్వరం) : అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణాన్ని బాగు చేయాలని జనసేన పార్టీ అన్నమయ్య జిల్లా నాయకులు రామా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం అయన జనసేన పార్టీ రాయచోటి నియోజవర్గ ఇన్చార్జి హషన్ బాషా, పార్టీ జిల్లా కార్యక్రమాల సభ్యులు షేక్ రియాజ్ లతో కలిసి రాయచోటి మున్సిపాలిటీలోని పలు వార్డులలో అధ్వానంగా ఉన్న సిమెంట్ రోడ్లు, కంపు కొడుతున్న డ్రైనేజీ కాలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా కేంద్రం అయిన రాయచోటి పట్టణంలో మురికి కాలువలు, సిసి రోడ్లు సక్రమంగా లేక అభివృద్ధికి నోచుకోని ప్రాంతంగా మిగిలిపోయిందన్నారు. అలాగే ఇక్కడ తేలికపాటి వర్షానికే డ్రైనేజీ పాడుపడిపోయి మురుగు నీరంతా వీధుల్లో, రోడ్లపై ప్రవహిస్తూ పట్టణంలోని రోడ్లన్నీ అడుగుకో గుంత గజానికో గొయ్యిలా మారిపోయాయన్నారు. వైద్య సేవల కోసం వెళ్ళే రోగులు, స్కూళ్ళకు వెళ్ళే పిల్లలు, ద్విచక్ర వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మూడున్నర సంవత్సరాలుగా చిన్న పాటి అభివృద్ధి పనులు చేపట్టిన పాపాన పోలేదన్నారు. స్థానిక శాసనసభ్యులు ప్రజలు ఆయన మీద నమ్మకం ఉంచి ఇచ్చిన బాధ్యత కూడా పక్కన పెట్టి ఆయన వ్యక్తిగత స్వార్ధ రాజకీయలబ్ది, ఆయన సొంత వర్గీయుల అభివృద్ధి విషయంలో వున్నంత శ్రద్ద నియోజకవర్గ పరిధిలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై లేదని ఆరోపించారు. అధికార పార్టీ నేతల మాటల్లో మాత్రం అభివృద్ధి పదాలు అద్భుతంగా ఉంటాయని, చేతల్లో వచ్చేసరికి కంటి చూపు మేర ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదన్నారు. ఇప్పటికైనా పాలకులు ప్రజలు ఓటు ద్వారా అప్పచెప్పిన బాధ్యతను తెలుసుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అనుగుణంగా పనిచేయాలని జనసేనపార్టీగా ఆయన డిమాండ్ చేశారు. అలాగే రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, స్థానికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com