అరకు, (జనస్వరం) : అరకు వేలి మండలము లోతేరు పంచాయతీ పరిధిలో గల కాంగు వలస గ్రామంలో శుక్రవారం ఉదయం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆయా గ్రామాలలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఇంటింటికి జనసేన మాటలు జనసేన పార్టీ సిద్ధాంతాలు గ్రామ ప్రజల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామ ప్రజలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో కొలాయిల మరమత్తు అవడంతో మంచినీరు కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్టు జనసేన దృష్టికి తీసుకువచ్చారు. గ్రామాల్లో డ్రైనేజీ, సి సి రోడ్డు సమస్యలతో వర్షకాలంలో ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు సాయిబాబా దురియా. మాదల శ్రీ రాములు. మండల అధ్యక్ష కార్యదర్శులు అల్లంగి.రామకృష్ణ. కిలో రాజా భరత్. గతమ్ లక్ష్మణరావు తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణం స్పందిస్తూ కొలాయిల మరమ్మతులు చేపడుతూ మంచినీరు సదుపాయం కాంగు వలస గ్రామంలో ప్రజలకు కల్పించగలరు అని ఈ సందర్భంగా ప్రభుత్వానికి జనసేన పార్టీ డిమాండ్ చేస్తుందని తెలిపారు. సీసీ రోడ్డు, డ్రైనేజ్ సమస్యను పరిష్కారం చేయాలని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని గ్రామస్థులతో ప్రభుత్వానికి నినాదాలతో నిరసన తెలిపారు. అనంతరం మరమ్మత్తులో ఉన్న కొలాయిలను జనసేన బృందం పరిశీలించారు. అనంతరం కొళాయిలు మరమ్మతులు తక్షణం చేపట్టాలని సచివాలయ సెక్రెటరీకి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com