Logo
Date of Publish : 03 October 2023, 9:33 pm
Editor : Sake Naresh

శిథిలమైన గుంతల రహదారికి మరమ్మత్తు – విశేష స్పందన

      అనంతపురం ( జనస్వరం ) : క్లాక్ టవర్ బ్రిడ్జి ప్రక్కన కోర్టు రోడ్డుకు వైపు వెళ్లే సర్వీస్ రోడ్డు... శిధిలమైన గుంతల రహదారికి మరమ్మత్తు చేసినందుకు అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు  లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి గారికి "అభినందనలు" తెలిపిన స్థానిక నగర ప్రజలు, వాహనదారులు, దుకాణదారులు.  జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టిన శ్రమదానం కార్యక్రమం ద్వారా గుంతలు పడ్డ రహదారి మరమ్మత్తు చేసినందుకు స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 న అనంతపురం అర్బన్ నియోజకవర్గం పరిధిలోని టవర్ క్లాక్ బ్రిడ్జ్ పక్కన కోర్ట్ రోడ్డుకు పోవు సర్వీస్ రోడ్డు... శిధిలమైపోయిన రహదారికి జనసేన నాయకులు తెల్ల గరుసు వేసి గోతులను పూడ్చి చదును చేశారు. సంవత్సరాల తరబడి గుంతలు పడ్డ రోడ్లపై ప్రయాణం చేయలేక ఇబ్బంది పడుతున్నామని వాహనదారులు తెలియజేశారు. అనంతరం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరామిరెడ్డి  స్పందించి రహదారిని తన సొంత నిధులతో బాగు చేయడం పట్ల స్థానికులు, వాహనదారులు, వ్యాపారస్తులు.. జనసేన పార్టీకి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మరియు శ్రమదాన కార్యక్రమం చేసి రోడ్డు మరమ్మత్తు చేసిన జయరామిరెడ్డి గారికి అభినందనలు తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com