విజయనగరం, ( జనస్వరం) : విజయనగరం జిల్లా వ్యాప్తంగా అర్దాంతరంగా తొలగించిన పెన్షన్లు, రేషన్ కార్డ్లు తక్షణమే మంజూరు చేయాలని జనసేన పార్టీ సీనియర్ నాయకులు అదాడ మోహనరావు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. దీనిపై కలెక్టరేట్ ముందు శాంతియుతంగా ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ గ్రీవిన్స్ లో వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సంక్షేమ పథకాలపేరుతో అప్పులుపాలు చేసి రాష్ట్రాన్ని గుల్లచేసేపనిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారని, కార్పొరేషన్ నిధులను మొదలుకొని, వృద్ధుల పింఛన్లు, ఆఖరికి వికలాంగులకు కేటాయించిన నిధులను కూడా సంక్షేమ పథకాలకోసం ఖర్చు పెట్టే తీరుచూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోడానికి ఎంతోదూరంలో లేదని ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు పద్నాలుగు వేలు పైన రేషన్ కార్డులు, పెన్షన్లు వికలాంగులతో కలుపుకొని సుమారు పద్దెనిమిది వేలకు పైగా తొలగించారని, తక్షణమే తొలగించిన పెన్షన్లు, రేషన్ కార్డ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ పోరాడుతోందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమములో జనసేన పార్టీ సీనియర్ నాయకులు దంతులూరి రామచంద్రరాజు, వంక నరసింగరావు, సాసుబిల్లి రామునాయుడు, అడబాల వెంకటేష్ నాయుడు, భాస్కర్, శ్రీను, రాజు, అప్పలనాయుడు, రాజేస్, సత్యనారాయణ, భారీగా జనసేన ఝాన్సీ వీరమహిళలు మరియు తదితురులు పాల్గొన్నారు