జగ్గంపేట ( జనస్వరం ) : జగ్గంపేట నియోజకవర్గంలో ప్రారంభించిన జనం కోసం జనసేన మహాయజ్ఞం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. వీలైనంత వరకు వాటిని పరిష్కరిస్తున్న జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోనీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఈ జనం కోసం జనసేన అనే మహాయజ్ఞం ద్వారా ఇప్పటికే చాలా ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది అని అన్నారు. ఈ నేపథ్యంలో గోకవరం పట్టణంలో డ్రైవర్స్ కాలనీలో ప్రతి ఇంటికి తిరుగుతున్న సమయంలో ఏకుల రామలక్ష్మి గారి ఇంటి వద్ద 220 వోల్ట్స్ కరెంటు వైర్లు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. చెయ్యి పూర్తిగా పైకి ఎత్తకుండానే చేతికి తగిలేలా ఉన్నాయి. ఆ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారని వారు ఆడుకునే సమయంలో పొరపాటున ఏదైనా కర్ర గానీ, ఏదైనా ఆట వస్తువు గానీ తగిలితే ఎంత ప్రమాదం జరుగుతుందో అని బిక్కు బిక్కు మంటు బ్రతుకుతున్నామని రామలక్ష్మి గారు చాలా భయాందోళనలకు గురి అవుతున్నారు. అదేవిధంగా వర్షం వచ్చినపుడు గోడలు పట్టుకోవాలన్న కానీ చాలా భయంగా ఉందని కంటతడి పెట్టుకున్నారు. ఇక్కడే కాదు ఇదే విధంగా విద్యుత్తు వైర్లు ప్రమాదకర స్థాయిలో కిందికి వేలాడుతూ చాలా చోట్ల ఉన్నాయని. అక్కడ కూడా ప్రజలు ఇదే విధంగా ఎప్పుడు ఏమి జరుగుతుందో అని భయం భయంగానే జీవిస్తున్నారు. ప్రభుత్వం మరియు ఆయా ప్రాంతాల విద్యుత్తు అధికారులు వెంటనే అలాంటి ప్రమాదకర పరిస్థితులలో ఉన్న విద్యుత్తు వైర్లను గుర్తించి వాటిని వెంటనే సరి చేసి తగినంత ఎత్తులో ఉండేలా చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేయడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com