మంగళగిరి ( జనస్వరం ) : పని వత్తిడి వల్ల తాడేపల్లి - ముగ్గురోడ్ ప్రాంతానికి చెందిన ఆశా వర్కర్ కృపమ్మ మృతి కారణమైన ప్రకాష్ నగర్ ఆస్పత్రి మెడికల్ అధికారి మానస మంజరి, హెచ్. యు రమాదేవిపై తగిన చర్యలు తీసుకోవాలని ఎపి ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తాడేపల్లి తాసిల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే దీక్షలు సోమవారం 7వ రోజుకి చేరుకున్నాయి. ఈ దీక్షలకు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జనసేన నాయకులు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆశా వర్కర్ కృపమ్మను పని ఒత్తిడి గురిచేసి మృతికి కారణమైన ప్రకాష్ నగర్ ఆస్పత్రి మెడికల్ అధికారి మానస మంజరి,హెచ్.వి. రమాదేవి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా టైం లో ఆశా వర్కర్ల సేవలు మరువలేనివని అన్నారు. వారికి కనీసం ఒక్క రోజు కూడా సెలవు లేకుండా పనిచేయించడం సరైన విధానం కాదని అన్నారు. ఆశా వర్కర్లకి ఒక్కరోజు సెలవు ఇవ్వాలని పని భారాన్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శా వర్కర్లకి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, తాడేపల్లి మండల ఉపాధ్యక్షులు పసుపులేటి అశోక్, తాడేపల్లి మండల ప్రధాన కార్యదర్శి చీరల లాల్ చంద్, మండల కార్యదర్శి మున్నా శ్రీనివాసరావు, చిర్రావూరి గ్రామ కార్యదర్శి వేంపాటి హరినాథ్ తదితర నాయకులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com