కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామానికి చెందిన బేగం బి గారి చిన్న కూతురు హాజర బి అనే అమ్మాయి ఆగస్టు 17 తేదీన జరిగిన సంఘటన గురించి అమ్మాయి కుటుంబ సభ్యులు రేఖగౌడ్ గారిని కలిసి వారి న్యాయం జరగలేదు మాకు న్యాయం చేయండి అని కోరడం జరిగింది. రేఖ గౌడ్ గారు వారికి న్యాయం కోసం పోరాడుతామని మాట ఇచ్చిన విషయం అందరికి విదితమే. ఈరోజు అమ్మాయి తలిదండ్రులు మరియు జనసేన పార్టీ వీరమహిళ విభాగం చైర్మెన్ మరియు ఎమ్మిగనూరు ఇంఛార్చ్ రేఖ గౌడ్ గారు మరియు కర్నూలు జిల్లా నాయకుడు పవన్ కుమార్ గారు ఎమ్మిగనూరు జనసేన సైనికులు కలిసి కోడుమూరు సిఐ గారిని కలిసి సమస్యను వివరించారు. దోషులను శిక్షించాలని అని కోరుతూ అనుమానితులు వివరాలు అందచేయడం జరిగింది. సిఐ గారు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా నిందితులను విచారించి శిక్ష పడేవిధంగా చేస్తామని అని రేఖ గౌడ్ గారికి హమీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.