ఎమ్మిగనూరు ( జనస్వరం ) : చిత్తూరు జిల్లా పెనుమూరు గ్రామానికి చెందిన విద్యార్థిని భావ్యశ్రీ హత్య ఘటనను జనసేన పార్టీ రాష్ట్ర మహిళా సాధికార చైర్మన్ జవ్వాజి రేఖ గౌడ్ తీవ్రంగా ఖండించారు. బుధవారం రోజు కర్నూలు నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో రేఖగౌడ్ మాట్లాడుతూ భావ్యశ్రీ హత్య ఘటన రాష్ట్ర మహిళాలోకానికి తీవ్రంగా కలచి వేసిందని ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్య అని అన్నారు. మహిళలకు ప్రభుత్వంలో రక్షణ కరువైందని ప్రత్యేకించి బిసి మహిళలపై దాడులు, హత్యలు, హత్యచారలు, రోజు రోజుకు పెరిగిపోతుంటే బీసిలపై కపట ప్రేమను చూపిస్తూ జరుగుతున్న అఘాయిత్యాలు అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు, భావ్యాశ్రీ ఘటన మానవత్వానికి తలవంచేలా చేసిందని బిసి కులానికి చెందిన మహిళ దారుణ హత్యకు గురైతే ఆత్మహత్యగా చిత్రీకరించే పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ సంఘటన పై రాష్ట్ర మహిళ కమిషన్ ఇంత వరకు ఎందుకు నోరు మెదపడం లేదో పలు అనుమానాలు కలుగు తున్నాయని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు ప్రభుత్వం పటిష్టంగా సత్వరమే చర్యలు తీసుకోవాలని బాధిత మహిళ కుటుంబానికి అన్నివిధాల ప్రభుత్వమే అదుకోని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళా విభాగం నాయకులు పాల్గోన్నారు.