Logo
Date of Publish : 02 October 2022, 2:39 am
Editor : Sake Naresh

పోడారాల పల్లి గ్రామ ప్రజలకు పునరావాసం కల్పించండి : జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్‌ రెడ్డి

    ధర్మవరం (జనస్వరం) : ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలం పోడరాలపల్లి గ్రామానికి చెందిన వారికి పునరావాసం కల్పించాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆర్డీఓ తిప్పే నాయక్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పోడరాలపల్లి గ్రామా నికి చెందిన జిల్లేడు బండ ప్రాజెక్టు 0.48 టిఎంసి ఉన్నది. ఇందుగ్గాని ప్రభుత్వం రిజర్వాయర్‌ ను పెంచుతూ డ్యాం నిర్మాణం చేపట్టడంతో 2.48 టీఎంసీ కెపాసిటీకి పెంచడంతో ఆ గ్రామంలో నీరు వచ్చి, గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అదేవిధంగా పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మండలానికి సంబంధించిన రామ సాగరం, గోపాలపురం గ్రామాలకు సంబంధించి దాదాపుగా ఎనిమిది వందల ఎకరాలలో గల పంటలు ముంపుకు గురవుతున్నాయని, ముంపుకు గురైన రైతులకు నష్టపరిహారం ఎంత చెల్లిస్తారనేది ప్రకటించిన తర్వాతనే, ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని వారు కోరారు. తదుగుణంగా అధికారులు త్వరలోనే నిర్ణయాలు తీసుకొని రైతులను, ప్రజలను ఆదుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు అడ్డగిరి శ్యాం కుమార్‌, మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శీనివాసులు, రూరల్‌ మండలం కన్వీనర్‌ నాగ సుధాకర్‌ రెడ్డి, జిల్లా ఐ.టి కోఆర్దినేటర్‌ పసల శ్యాంసుందర్‌, పేరూరు శ్రీనివాసులు, కోటికి రామాంజి, దాడి తోటి కృష్ణయ్య, నారాయణస్వామి నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com