Logo
Date of Publish : 10 February 2023, 3:30 pm
Editor : Sake Naresh

రెడ్డిగూడెంలో జనసేన క్రియాశీలక సభ్యత్వం నమోదు ప్రారంభం

        రెడ్డిగూడెం, (జనస్వరం) : రెడ్డిగూడెంలో జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ ఇంచార్జ్ అక్కల రామ్మోహనరావు (గాంధీ) క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం రెడ్డిగూడెంలో ప్రారంభించారు. రెడ్డిగూడెంలోని ప్రజలకు అవగాహన కొరకు సభ్యత్వం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినోయోగించుకుని మీ కుటుంబానికి భరోసాని కల్పించుకోవాలన్నారు. ఈ కార్యక్రమం ఈ నెల 10వ తారీకు నుండి 28వ తారీకు వరకు జరుగుతుందని అందరూ సద్వినియోగ పరుచుకోవాలని కోరారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయన కార్యకర్తల కోసం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కార్యక్రమం జనసేన క్రియాశీల సభ్యత్వ కార్యక్రమం ఈ సభ్యత్వం పొందిన వారికి ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే పార్టీ నుండి ఐదు లక్షల రూపాయలు తన కుటుంబ సభ్యులకు అందిస్తుందని తెలిపారు. ఒకవేళ గాయపడి హాస్పిటల్ లో జాయిన్ అయితే ఖర్చుల నిమిత్తం యాభై వేల రూపాయలు అందిస్తుందన్నారు. ఈ క్రియాశీల సభ్యత్వ కార్యక్రమం ఇప్పటికే రెండు సంవత్సరాలు విజయవంతంగా సాగిందన్నారు. గత సంవత్సరంలో మరణించిన క్రియాశీల కార్యకర్తలు 96 మందికి ప్రమాద బీమా కింద నాలుగుకోట్ల ఎనభై లక్షల రూపాయలు అందించారు ఒకరికి అయిదు లక్షల చొప్పున, ప్రమాదవసాత్తు గాయపడిన 169 మంది కార్యకర్తలకు అరవై లక్షల తొంబై వేల రూపాయలు అందించినట్లు తెలిపారు. ఈ క్రాయక్రమంలో రెడ్డిగూడెం మండల అధ్యక్షుడు చాపలమడుగు కాంతారావు, ఉపాధ్యక్షులు పాములపాటి సుందరరామిరెడ్డి,బొల్లిపోగు చంటి, మైలవరం మండల అధ్యక్షుడు శీలం బ్రహ్మయ్య, మండల కమిటీ సభ్యులు, శివ, దుర్గాప్రసాద్, రమేష్, పి.రమేష్, అనంత్ కుమార్, రామకృష్ణ, గురు ప్రియతం, సాయి, సురేష్ ఇంకా జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com