• యువశక్తి పోస్టర్ ను విడుదల చేసిన గురాన
• గతంలో జీఓ 1 ఉంటే జగన్ రెడ్డి పాదయాత్ర చేసుండేవారా?
విజయనగరం, (జనస్వరం) : ఈ నెల 12వ తేదీన రణస్థలంలో జరిగే యువశక్తి సభకు పేర్ల నమోదు చేసుకోవాలని జనసేన నాయకులు గురాన అయ్యలు పిలుపునిచ్చారు. దీనికోసం జనసేనపార్టీ ప్రత్యేక ఫోన్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ కేటాయించినట్టు తెలిపారు. ఫోన్ నంబరు 080 69932222, vrwithjspk@ janasenaparty.org సంప్రదించి పేర్ల నమోదుకు అవకాశం ఉందన్నారు. గురువారం ఉదయం స్థానిక జి.ఎస్.ఆర్ కాంప్లెక్స్ లో గురాన అయ్యలు కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఈ నెల 12వ తేదీన శ్రీకాకుళంలో నిర్వహించే బహిరంగ సభ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అయ్యలు మాట్లాడుతూ యువశక్తి సభలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో యువత తమ గొంతుకను వినిపించవచ్చునన్నారు. దీనిలో పాల్గొనేందుకు జనవరి 5వ తేదీ నుంచి 8వ తేదీలోపు యువతీ యువకులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చన్నారు. వాయిస్ రికార్డర్ ద్వారా పని చేసే ఈ ఫోన్ నంబరులో యువతీ యువకులు ఏ అంశం మీద మాట్లాడాలి అనుకుంటున్నారో క్లుప్తంగా వాయిస్ రికార్డు చేసి చెప్పవచ్చు.. లేదా ఈ-మెయిల్ కు తగిన వివరాలను పంపవచ్చు అని వివరించారు. ఇక, ఆ వివరాలను పరిశీలించి పార్టీ కార్యాలయం నుంచి మీకు తగిన సమాచారం వస్తుందని పేర్కొన్నారు. యువత జనసేన వైపు చూస్తుందని, జనసేన బలమేంటో 12వ తేదీన తెలుస్తుందన్నారు. ప్రతిపక్షపార్టీల గొంతు వినిపించకూడదు, ఆ పార్టీలు కార్యక్రమాలు నిర్వహించకూడదు అనే ఉద్దేశంతోనే జీవో 1 తీసుకొచ్చారని విమర్శించారు. ఇటువంటి జీవో గతంలో ఉండి ఉంటే జగన్‌రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేయగలిగేవారా? అని ప్రశ్నించారు. మరో నాయకులు ఆదాడ మోహనరావు మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్రంలోను, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వారసత్వ రాజకీయాలకు, బానిసత్వ రాజకీయాలకు గతప్రభుత్వాలు పెద్దపీట వేసాయని, అవకాశాలు ఉన్నా.. యువతకు ఉపాధి అవకాశాలు ప్రభుత్వం ఇవ్వకుండా నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ నాయకులు ఆదాడ మోహన్ రావు, కాటం అశ్విని, త్యాడ రామకృష్ణారావు (బాలు), రవితేజ, వజ్రపు నవీన్ కుమార్, పిడుగు సతీష్, పవన్ కుమార్, సాయి, మణి, రవీంద్ర, ఏంటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.