ఎమ్మిగనూరు ( జనస్వరం ) : విద్యుత్ కోతలతో ప్రజలను ఇబ్బందికి గురిచేస్తున్న ప్రభుత్వం తాజాగా చార్జీలు పెంచి పేద మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం వేసి నడ్డి విరుస్తున్నారని పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించి కరెంట్ కోతలు నివారించాలని జనసేనపార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ మీడియా ఇంచార్జి గానిగ బాషా ప్రభుత్వాన్ని కోరారు. మండల కేంద్రమైన గోనెగండ్లలో గురువారం రోజు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతు విద్యార్థులకు పరిక్షలు సమీపిస్తున్నా తరుణంలో సమయపాలన లేకుండా విద్యుత్ కోతలు విధిస్తే రాత్రి వేళల్లో దీపాలు వెలిగించుకొని చదువుకొనే పరిస్థితి దాపురించిందని కరెంటు కోతలతో రాత్రుల్లో విద్యార్థులు, సామాన్య ప్రజలు పడే ప్రస్తుత పరిస్ధితులను పరిష్కరించకుండానే ప్రభుత్వం విద్యుత్ చార్జీల మోత మోగించి ప్రజలకు వేసవిలో ఉగాది కానుకల రూపంలో భారం మోపేందుకు సిద్దమైన ప్రభుత్వాన్ని ప్రజలు మునుపెన్నడూ చూడలేదని ఆరోపించారు. సామాన్య ప్రజలు ఇప్పటికే అన్ని రకాల అత్యవసర నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగితే కొనలేని – తినలేని పరిస్థితుల్లో ప్రజలు వున్నారని విద్యుత్ చార్జీలు పెంచి సామాన్యులపై అదనపు భారం వేయడం దారుణం అన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎటువంటి పన్నులు చార్జీలు పెంచబోమని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత దశల వారిగా అన్ని రకాల పన్నులు పెంచారని ప్రజా వ్యతిరేఖ విధానాలను అవలంభించే ప్రభుత్వాలకు ప్రజలే తగిన సమయంలో సరైన గుణపాఠం చెబుతారని, ఇప్పటికైనా విద్యుత్ కోతలను నివారించి సామాన్య ప్రజలకు భారం పడకుండా పెంచిన విద్యుత్ చార్జీలను రద్దు చేయాలన్నారు.