ఏలూరు ( జనస్వరం ) : పల్నాడు జిల్లా వినుకొండ సభలో జగన్మోహన్ రెడ్డి అబద్దాలు ఆడుతున్నారని రెడ్డి అప్పలనాయుడు ఆగ్రహం వ్యక్తం చేసి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అబద్ధాలు ఆడటానికి ఏమాత్రం వెనుకాడటం లేదని అన్నారు. 2019 ఎలక్షన్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ముద్దులు పెట్టి ఆకట్టుకొని అధికారంలోకి వచ్చారని, వచ్చిన తర్వాత అన్ని వర్గాలను ఏ విధంగా ఈ 44 నెలల పాలనలో మోసం చేశాయో మనం చూస్తూనే ఉన్నాము. నిన్న పల్నాడు జిల్లా లో జరిగిన జగనన్న చేదోడు కార్యక్రమంలో అబద్ధాలు ఆడుతున్నారని, నా ఎస్సీ సోదరులు,నా ఎస్టీ సోదరులు, నా ముస్లిం మైనార్టీ సోదరులు, నా బీసీ సోదరులు అంటూనే అన్ని వర్గాలకి గుండు కొట్టిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్ మోహన్ రెడ్డి గా చరిత్రలు నిలిచిపోయారని ధ్వజమెత్తారు. ఈ రోజున ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనారిటీ కార్పొరేషన్ల ను పూర్తిగా నిర్వీర్యం చేసి తుంగలో తొక్కిన ఘనత కూడా జగన్ మోహన్ గారిది. ఈరోజు విదేశీ చదువులు చదువుకునే స్థోమత లేదు. పెళ్లి కానుకలు ఇచ్చే పరిస్థితి లేదు.ఎవరైనా మరణిస్తే అప్పట్లో చంద్రన్న బీమా ఉండేది.మరీ ఈ రోజున ఈ దొంగ ముఖ్యమంత్రి ఆ భీమా లను తీసివేసి ఈరోజు అన్ని రకాలుగా ప్రజలను వంచిస్తున్నారు.. నిన్న వినుకొండ బహిరంగ సభలో ఇంకా మోసం చేయాలని చూస్తున్నారు.. బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను ఇంకా మోసం చేయాలి..దగా చేయాలి. వాళ్లను బతకనిచ్చే పరిస్థితి లేదు.కార్పొరేషన్ లో పనిచేసే వాళ్ళకు జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదుకానీ ఇంకా ఈ జగనన్న చేదోడు పథకం ఇవ్వడానికి ఏ విధంగా హామీ ఇస్తున్నావని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నీ ప్రశ్నించారు? ఇవన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తున్నారు..ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తే నైతిక హక్కులు లేదన్నారు.సొంత బాబాయిని హతమార్చిన వాళ్లను కొమ్ముకాస్తూ వెనకేసుకొచ్చి సిబిఐ తేటతెల్లం చేస్తుందని ఈ యొక్క బాగోతాలు అన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇంత జరుగుతున్నా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్దాలు ఆడుతున్నారని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధిగా ఖండిస్తున్నా హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పే అబద్ధాలు ఎన్నో రోజులు చెల్లుబాటు కాదని ఇప్పటికైనా నిజాయితీగా మాట్లాడాలని నిజాయితీ గల పరిపాలన అందించాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని ఇంటికి సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారని మంచి పరిపాలన అందించాలని లేని పక్షంలో ప్రజలే మిమ్మల్ని తరిమి తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నగర ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి,మహిళ కమిటీ టూ టౌన్ ప్రధాన కార్యదర్శి తుమ్మపాల ఉమాదుర్గ నాయకులు నాని తదితరులు పాల్గొన్నారు.