ఏలూరు ( జనస్వరం ) : 6వ డివిజన్ చాటపర్రు రోడ్ లో స్థానిక నాయకులు హరీష్, రాజేష్, నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు రెడ్డి అప్పల నాయుడు గారి చేతుల మీదుగా చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది లంకకు వెళ్లే దారి.. నిత్యం రాకపోకలతో రద్దీగా ఉండే ప్రాంతం.. ఇటువంటి ప్రాంతంలో చదివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ వేసవికాలం అంతా వచ్చిపోయే ప్రజలకు దాహార్తిని తీర్చడానికి ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది.. పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో ఉండి ప్రజల తరఫున సమస్యలు పరిష్కారంగా ప్రజలకు సహాయం చేస్తూ ప్రజల మనసులను గెలుచుకోవాలి అని వారు ఆపదలో ఉంటే సహాయం చేయడం జనసేన పార్టీ నైజం, నాయకులు వీర మహిళలు జనసైనికుల నైజం.. అందరూ సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని దానిలో భాగంగానే ఈరోజు ఏలూరులో మూడు చోట్ల చలివేంద్రాలను ప్రారంభించడం జరిగిందని అన్నారు.. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ళా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కావూరి వాణిశ్రీ, కార్యదర్శి కందుకూరి ఈశ్వరరావు, బొత్స మధు, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, బోండా రాము నాయుడు, రెడ్డి గౌరీ శంకర్, నిమ్మల శ్రీనివాసరావు, వేముల బాలు, గొడవర్తి నవీన్,బండి రామకృష్ణ,స్థానిక నాయకులు దోసపర్తి రాజు,హరీష్, రాజేష్, నాగేశ్వరరావు, గోవిందు, పండు, రాము,1 టౌన్ మహిళ ప్రెసిడెంట్ కోలా సుజాత, 2 టౌన్ మహిళ సెక్రటరీ తుమ్మపాల ఉమాదుర్గ, కోశాధికారి ప్రమీల రాణి,బీబీ తదితరులు పాల్గొన్నారు.