అనంతపురం రూరల్, నవంబర్ 3, జనస్వరం: అనంతపురం రూరల్ మండలం కందుకూరు గ్రామంలో ఉన్న శ్రీ శ్రీ శ్రీ సాకే (చింతమాను) రామప్ప గారి వంశీకుల ఆధ్వర్యంలో శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః నిర్మాణం పూర్తయింది. ఈ నెల 9వ తేదీ ఉదయం 1.30 నుండి 3.05 గంటల మధ్య ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించుకుని భక్తులందరికీ దర్శనమివ్వనున్నారు. ఆలయ కమిటీ ప్రకటన ప్రకారం, పునః ప్రారంభోత్సవం సందర్భంగా దాసంగం వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. భక్తుల కోసం ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు తమకు తోచిన కానుకలు - బియ్యం, బెల్లం, కంది బేడలు వంటి వస్తువులు అందించవచ్చని కోరారు. దేవాలయ పునః నిర్మాణం కోసం సహాయం అందించిన ప్రతి భక్తుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, దేవుడి ఆశీస్సులు ఎల్లవేళలా వారి కుటుంబాలను కాపాడాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇకపై ప్రతిరోజూ దీపారాధన, ప్రతి శనివారం పూజా కార్యక్రమాలు నిరంతరం నిర్వహించబడుతాయని చెప్పారు.
పూజా కార్యక్రమాల అనంతరం కొత్త ఆలయ కమిటీ ఏర్పాట్లు చేపట్టి, సభ్యులను ఎన్నుకునే విధివిధానాలు ప్రకటిస్తామని తెలిపారు. అందరూ పాల్గొని ఈ దాసంగం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీ చింతమాను రామప్ప వంశపారపర్య భక్తులు కోరారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com