
మాడుగుల ( జనస్వరం ) : జనసేన నాయకులు రాయప రెడ్డి కృష్ణ గారు మాడుగుల నియోజకవర్గ ప్రజలకు ఉచిత అంబులెన్స్ సర్వీస్ కొరకు రెండు అంబులెన్స్ ని ఏర్పాటు చేశారు. ఈ అంబులెన్సులను తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరుగుతున్న వారాహి యాత్ర వద్ద జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ప్రారంభించారు. రాయపరెడ్డి కృష్ణ గారు మాట్లాడుతూ గతంలో నియోజకవర్గంలో సమయానికి అంబులెన్స్ అందుబాటులో లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారని సమయానికి అంబులెన్స్ రాక ఒకరిద్దరు ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగిందని అన్నారు. ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత ఎంతో మానసిక వేదనకు గురై అధికారంలో ఉన్న లేకపోయినా ప్రజాసేవే ముఖ్యమన్న పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు అనుగుణంగా నియోజకవర్గ ప్రజలకి ఉచిత అంబులెన్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అంతేకాకుండా రాబోవు జనసేన ప్రభుత్వంలోనూ మాడుగుల నియోజకవర్గం అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తామని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో భీముని నియోజకవర్గ ఇన్చార్జ్ పంచకర్ల సందీప్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్, వారాహి యాత్ర కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు భోగిల శ్రీనివాస పట్నాయక్ పాల్గొన్నారు.