Logo
Date of Publish : 04 March 2022, 4:58 pm
Editor : Sake Naresh

నిరుపేద కార్యకర్తల కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు శ్రీమతి పెండ్యాల శ్రీలత

    అనంతపురం, (జనస్వరం) : జనసేన పార్టీ "రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు" శ్రీమతి పెండ్యాల శ్రీలత గారి ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని జనసేన పార్టీ నిరుపేద కార్యకర్తల కుటుంబాలకు 25కేజిల బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇటీవలే ప్రమాదవశాత్తు మృతి చెందిన అనంతపురం నగరంలోని బీజేపీ కాలనికి చెందిన జనసేన కార్యకర్త గుండె సంజీవరాయుడు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి 25కేజీల బియ్యం నిత్యావసర సరుకులు పెండ్యాల శ్రీలత అందించి గుండె సంజీవరాయుడు పిల్లల విద్యాభివృద్ధికి పెండ్యాల హరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అండగా ఉంటామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పసుపులేటి పద్మావతి, జిల్లా కార్యదర్శి కాశెట్టి సంజీవ రాయుడు, సంయుక్త కార్యదర్శి దేవరకొండ జయమ్మ, నాయకులు పెండ్యాల చక్రధర్, రోడ్ల భాస్కర్, తోట ప్రకాష్, టీ.ఎన్.అంజి, M.V శ్రీనివాస్, ఆకుల ప్రసాద్, ముని, సుమన్, వంశీ, చిరు తదితరులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com