Logo
Date of Publish : 07 August 2021, 1:30 pm
Editor : Sake Naresh

జనసేన రాష్ట్ర చేనేత వికాస విభాగపు కార్యదర్శిగా రవిప్రకాష్

                జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించిన, రాష్ట్ర కమిటీలో ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన కసా రవిప్రకాష్ ను రాష్ట్ర కార్యదర్శిగా నియమించినట్లు మహిళ సాధికారిక చైర్మన్ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జి రేఖగౌడ్ తెలిపారు. ఈ సందర్బంగా రాష్ట్ర కార్యదర్శి రవిప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో నేతన్నలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ చేనేత కళాకారులకు అండగా ఉంటామని తెలిపారు. జనసేనపార్టీ క్రియాశీలక కార్యక్రమలలో కార్యకర్తగా బాధ్యతాయుతంగా పనిచేసిన తనను ఇంచార్జి రేఖగౌడ్ తనను గుర్తించి రాష్ట్ర చేనేత వికాస విభాగపు కమిటీలో కార్యదర్శి నియమించేలా కృషిచేశారని, అధినేత ఆశయాల సాధనకోసం సైనికుడిలా పనిచేస్తానని అన్నారు, చేనేతపురిగా పిలవబడే ఎమ్మిగనూరు చేనేత కార్మికుల సమస్యల సాధనకోసం నిరంతరం శ్రామికునిల పనిచేస్తానని తెలిపారు, భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన అతిపెద్ద ఉపాధి చేనేత ఈరంగానికి చెందిన చేనేత కార్మికులు కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని అన్నారు, చేనేత రంగాన్ని కాపాడుకోవాలంటే కళాకారులను ప్రోత్సాహించాలని కోరారు. జాతీయ చేనేత దినోత్సవం సంధర్బంగా చేనేత కళాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com