Logo
Date of Publish : 08 November 2023, 11:37 pm
Editor : Sake Naresh

రావికమతం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి

         విశాఖపట్నం ( జనస్వరం ) : పంటలు నష్టపోయిన రైతులకు సత్వరమే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని చోడవరం జనసేన ఇంచార్జి  పి‌వి‌ఎస్‌ఎన్ రాజు డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు 9 గంటల కరెంటును నిరంతరాయంగా సప్లై చేయాలి.  కవగుంట రైతులతో సమావేశంలో మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న రైతులను, చక్కెర బకాయిలను చెల్లించకుండా బస్సుయాత్ర పేరుతో రైతులను ప్రజలను మోసం చేస్తున్న YSRCP ప్రభుత్వ వైఖరిని ఖండించారు. పంట నష్టపోయిన కొంత మంది నిరుపేద రైతులకు పార్టీ తరఫున స్వంత నిధులతో కొంత మేర ఆర్ధిక సహాయం చేస్తామన్నారు. వర్షపాతం సగటు కన్నా తక్కువగా వుండడం వలన పంటలు నష్టపోయిన రైతుల కష్టాలు తెలుసుకొనుటకు రావికమతం మండలం నందలి కొమిర, కౌగుంట, కెబిపి అగ్రహారం, గుమ్మాలపాడు గ్రామముల వ్యవసాయ భూములను చోడవరం నియోజకవర్గ ఇంచార్జి  పివిఎస్ఎన్ రాజు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకొన్నారు. కవగుంట గ్రామ రైతులు,మహిళలుతో జరిగిన ముఖా ముఖి సమావేశం లో పంటలు కోల్పోయిన తమకు ఎలా బ్రతకాలో తెలియడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మైచర్ల నాయుడు, పార్టీ నాయకులు బలిజ మహారాజు, లొట్ల శివ, బంటు రామునాయుడు, యతిరాజ్యంభూషణం, పోలమ్మ, గెంజి ప్రసాద్ , కోన రమణ, పరమేశ్ , బండి అర్జున, లోవా, అయితిరెడ్డి రమణ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com