అనంతపురం, (జనస్వరం) : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న సంకల్పంతో అలాగే సమస్యల పరిష్కారానికి వేదికగా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ స్థానికులతో సమస్యలు తెలుసుకుంటున్న అర్బన్ ఇంచార్జ్, జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్. నగరంలోని స్థానిక 2వ డివిజన్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. స్థానిక ప్రజలు తమ సమస్యలను తెలుపుకునేందుకు జనసేన నాయకుల వద్దకు వచ్చారు. ముఖ్యంగా రేషన్ కార్డులు పింఛన్ల తొలగింపు, అధిక విద్యుత్ చార్జీలు, మౌలిక వసతుల లేమి, ఉపాధి లేక నిర్వీర్యం అవుతున్న యువత, ఇంటి వద్దకే రేషన్ పై అసహనం, రహదారుల మరమ్మత్తు డ్రైనేజీల దుస్థితి చెత్త పన్ను తదితర సమస్యలను జనసేన అధ్యక్షుల పవన్ కళ్యాణ్ దృష్టికి ప్రజలు తీసుకొచ్చారు. అందుకు ఆయన స్పందిస్తూ జనసేన పీడిత బాధిత ప్రజల పక్షాన నిలుస్తుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అందులో భాగంగా రాబోయే రోజుల్లో గ్రీవెన్స్ బాక్సులు ఏర్పాటు చేస్తామని టి.సి.వరుణ్ తెలియజేశారు. స్థానికంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్న నేరుగా తనను వచ్చి కలవచ్చునున్నారు. మీ వెంట తాను ఉండడమే కాకుండా సమస్యల పరిష్కారానికి అవసరమైతే పోరుబాట పడతానని వారికి భరోసా ఇచ్చారు. ప్రతి జనసైనికుడు ప్రజల్లో ఉండాలని అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను ప్రజలకు వివరించి క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని టి.సి.వరుణ్ పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ వైసిపి నాయకులకు సంపాదన తప్ప అభివృద్ధి పైన ధ్యాస లేదన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మోసం చేశారన్నారు. మరోసారి ఆయన మాయలో పడి తప్పు చేయొద్దని.. రాజకీయాల పట్ల నీతి నిజాయితీ చిత్తశుద్ధి అంకితభావం కలిగిన పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన చారిత్రాత్మక సందర్భాన్ని ఏ ఒక్కరు వదులుకోవద్దన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, జనసేన కార్యకర్తలు అధ్యక్షులు టి.సి.వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి కి గజమాల వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేలా కృషిచేసిన నగర ప్రధాన కార్యదర్శులు మేదర వెంకటేష్, రామాంజనేయులు, వారి మిత్ర బృందానికి అభినందనలు తెలియజేసిన అర్బన్ ఇంచార్జ్ & జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్, నగర అధ్యక్షులు పొదిలి బాబురావు. ఈ సందర్భంగా 2వ డివిజన్ ఇంచార్జ్ రామంజిని నియమిస్తున్నట్లు టి.సి.వరుణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యక్రమాల ప్రధాన కార్యదర్శి భవాని రవికుమార్, నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, జిల్లా ఉపాధ్యక్షులు జయరాంరెడ్డి, అంకె ఈశ్వరయ్య, ప్రాంతీయ మహిళా కమిటీ సభ్యులు పసుపులేటి పద్మావతి, జిల్లా ప్రధాన కార్యదర్శిలు పత్తి చంద్రశేఖర్, కుమ్మర నాగేంద్ర, జిల్లా కార్యదర్శులు కిరణ్ కుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శిలు విజయ్ కుమార్, ముప్పూరి కృష్ణ, నగర ఉపాధ్యక్షులు గ్రంధి దివాకర్, జక్కిరెడ్డి ఆదినారాయణ, నగర ప్రధాన కార్యదర్శులు రొల్ల భాస్కర్, వెంకటనారాయణ, ధరాజ్ భాషా, హుస్సేన్, చోటు, నగర కార్యదర్శిలు సంపత్, అంజి, లాల్ స్వామి, నగర సంయుక్త కార్యదర్శిలు వెంకటరమణ, ఆకుల అశోక్, ఆకుల ప్రసాద్, పవన్, నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.