
ఏలూరు ( జనస్వరం ) : మూసాపేట్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ మరియు కూకట్పల్లి నియోజకవర్గపు ఎగ్జిక్యూటివ్ మెంబర్ రతన్ ఏలూరు జనసేన పార్టీ ఇంచార్జ్ రెడ్డి అప్పల నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన మాట్లాడుతూ ఏలూరు విద్యానగర్ లోని రోడ్లు పరిస్థితిపై వివరించడం జరిగినది. స్ట్రీట్ లైట్లు వెలగట్లేదని తెలిపారు. రానున్న రోజుల్లో ఏలూరు జనసేనపార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని అన్నారు. జనసేనపార్టీ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసేలా కృషి చేద్దామని తెలిపారు.