పిఠాపురం/యు. కొత్తపల్లి, జూలై 24 (జనస్వరం): కొత్తపల్లి మండలంలోని వాకతిప్ప జెడ్పీ హై స్కూల్, ఉప్పాడ ప్రభుత్వ హైస్కూల్‌లో నిర్వహించిన మెగా పేరెంట్స్ డే కార్యక్రమానికి జనసేన పార్టీ మండల ఇన్‌చార్జ్ రావు అక్షయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి మాట్లాడిన ఆయన, విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, మంచి విలువలను అలవర్చుకుని ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.