
మైలవరం, (జనస్వరం) : కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో జనసేన నాయకులు అక్కల రామ్మోహనరావు ఆధ్వర్యములో జ్యోతి రావ్ పూలే 132 వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చేసిన కార్యక్రమాల్ని స్మరించుకుంటు పూలే చేసిన ఎన్నో మంచి పనులు, సమాజంలో ఆయన తీసుకువచ్చిన మార్పులు, బడుగు బలహీన వర్గాల జీవితాలు అభ్యున్నతి కోసం ఆయన చేసిన గొప్ప కార్యక్రమాలను జనసేన మైలవరం నియోజకవర్గ అధికార ప్రతినిధి అక్కల రామ్మోహనరావు కార్యక్రమంలో పాల్గొన్న వారికి వివరించి ఆయనని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చింత లక్ష్మీ, సామల సుజాత,యతిరాజుల ప్రవీణ్, రామిశెట్టి ప్రవీణ్, అశోక్ బాబీ, రాగల నాని, వెంకట్, సురేశ్, ఆంజనేయులు, చరణ్, శ్రీనివాస్, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.