Logo
Date of Publish : 13 January 2021, 12:58 pm
Editor : Sake Naresh

రామతీర్థ పోరాట కమిటీ

                  పవిత్ర పుణ్యక్షేత్రమైన రామతీర్థంలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయం మూలవిరాట్ విధ్వంసంపై దోషులను నిర్ధారించి దండించే వరకు బి.జె.పి.తో కలసి పోరాటం చేయడానికి నలుగురు సభ్యులతో కూడిన కమిటీని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు నియమించారు.ఈ కమిటీకి పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ టి.శివశంకర్ గారు నేతృత్వం వహిస్తారు. సభ్యులుగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు శ్రీమతి పాలవలస యశస్విని గారు, పార్టీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ కమిటీ సభ్యులు శ్రీ గడసాల అప్పారావు గారు, డాక్టర్  బొడ్డేపల్లి రఘు గారిని నియమించారు. రామతీర్థంలో స్వామికి అపచారం జరిగి వారాలు గడుస్తున్నా ఈ కేసులో ఇంత వరకు ఎటువంటి పురోగతి లేదు. తమకు స్వేచ్ఛను ఇస్తే ఎటువంటి జఠిలమైన కేసునైనా గంటల వ్యవధిలోనే పరిష్కరిస్తామని పోలీసు అధికారులు తరచూ ఆఫ్ ది రికార్డుగా చెబుతుంటారు. మరి ఈ కేసులో పోలీసులకు పూర్తి స్థాయి స్వేచ్ఛను ఇవ్వలేదని అనుమానించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ కేసులో సత్వర న్యాయం జరపడానికి బి.జె.పి. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారి బృందంతో కలసి ఈ కమిటీ పని చేస్తుంది. జనసేన కార్యకర్తలను అవసరమైన సమయాలలో సమాయత్తం చేస్తూ బి.జె.పి.తో సమన్వయం చేసుకుంటూ ఈ కమిటీ పని చేస్తుంది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com