Logo
Date of Publish : 03 November 2020, 11:31 am
Editor : Sake Naresh

రోడ్లను పట్టించుకోవాలని కోరుతున్న రామచంద్రాపురం జనసేన ఇంచార్జ్ పోలిశెట్టి చంద్ర శేఖర్

రోడ్లను పట్టించుకోవాలని కోరుతున్న రామచంద్రాపురం జనసేన ఇంచార్జ్ పోలిశెట్టి చంద్ర శేఖర్

                  రామచంద్రపురం నుండి కాకినాడ వెళ్ళే రోడ్డు మార్గంలో ఉన్న రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నది. ఇంత వరకూ గత, నేటి ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. తుఫాను వచ్చినప్పుడు హాస్పిటల్ కి వెళ్ళామంటే వైద్యం చేసే దారి లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ప్రభుత్వ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని అత్యవసరంగా ఈ రోడ్లుకు మరమ్మత్తులు చేస్తే బాగుంటుంది. కొత్త రోడ్లు వేయవలసిన పనిలేదు ఉన్న రోడ్లను మరమ్మత్తులు చేసినా చాలు. ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగి చనిపోతే సమాధానము ఎవరు చెప్పటం లేదు అని ఆవేదన తెలియజేశారు పోలిశెట్టి చంద్ర శేఖర్ గారు. రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రభుత్వాలు ఉన్నాయా..? లేవా? నాయకులు ఉన్నారా? లేరా? అని ప్రశ్నించారు. ప్రజలకు ఏ విధంగా కూడా ప్రజల సమస్యలు పరిష్కరించడం గాని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం గాని ఏ కార్యక్రమాల్లోనూ ముందుండటం లేదు. ఇదే మార్గంలో చాలా మంది వైసీపీ టిడిపి నాయకులు తిరుగుతున్నారు కానీ, గుంతలు కనపడటం లేదు. వాళ్ళకి ముట్టే లంచాలు తప్ప వాళ్ళకి రోడ్లమీద ధ్యాసే లేదు. మంత్రిగారు ఉండే నియోజకవర్గంలో కూడా రోడ్లు బాగా లేకపోవడం అనేది హాస్యాస్పదంగా ఉంది అని అన్నారు. 

       ఈ రోడ్లుని ఇలా ఉంచడం వలన ఇక్కడ ఉన్న ఆటో వాళ్ళు గాని, 2 వీలర్, వెహికల్స్ మీద వెళ్లే వారు గాని చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందుల వలన సస్పెన్షన్స్ పాడైపోవడం, అదే రకంగా మైలేజ్ లు రాకపోవడం, గోతులలో పడ్డారు అంటే క్రింద పడిపోయి దెబ్బలు తగలడం, హాస్పిటల్ కి వెళ్తే కరోనా టైంలో కాబట్టి వైద్యం లేకపోవడం. ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నా కూడా ఈ రోజున ప్రభుత్వం స్పందించడం లేదు. ఇప్పుడు ఉన్న నాయకులను ఒకటే అడుగుతున్నాం వాళ్ళు దీనిమీద నిబద్ధత తో చేస్తారా?? లేదా జనసైనికులు అందరూ కలిసి దీని మీద చర్యలు తీసుకుని ధర్నా చేయవలసిన పరిస్థితి ఉందని రామచంద్రపురం నియోజకవర్గం మంత్రి గారికి జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గం జనసేన నాయకులు బుంగారాజు గారు, సంపత్, రాంబాబు నాయుడు, జడ్డు సతీష్, కాళ్ళ ప్రసాద్, మద్దా ప్రసాద్, తదితర రామచంద్రపురం నియోజకవర్గం జనసైనికులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com