విశాఖపట్నం, (జనస్వరం) : విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం కోటఉరట్ల మండలం రామచంద్రపురం గ్రామపంచాయతీ పరిధిలో గెడ్డం బుజ్జి గారు ఆదేశాల మేరకు జనసేన పార్టీ జెండా స్తూపం స్థాపించడం జరిగింది. అలాగే జనసేన గ్రామ కమిటిలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోటవురట్ల మండలంలో గ్రామ స్థాయిలో జనసేన పార్టీ బలంగా ఉందని రామచంద్రపురం గ్రామం జనసైనికులు ఈ విధంగా ముందుకు రావడమే అందుకు నిదర్శనమని అన్నారు. భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ సిద్ధాంతాలు ఆశయాలును ముందుకు తీసుకెళ్తారని గ్రామ అధ్యక్షులు ఉగ్గిన రాము, మరియు బాలేపల్లి ఏసుబాబు, బద్రి రామచంద్రపురం గ్రామ జనసైనికులుకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దుర్గాప్రసాద్(లింగాపురం), లోవరాజు(k.వెంకటాపురం),నాగేశ్వరావు(కొడవటిపూడి), రవికుమార్ (సుంకపుర్) వివిధ గ్రామాలకు చెందిన జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com