Logo
Date of Publish : 23 November 2025, 2:30 pm
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతగా మదనపల్లిలో ర్యాలీ నిర్వహణ : మైఫోర్స్ మహేష్

చిత్తూరు, అక్టోబర్ 23, (జనస్వరం) : APIIC డైరెక్టర్‌గా ఈ నెల 26న విజయవాడలో ప్రమాణస్వీకారం చేయనున్న మైఫోర్స్ మహేష్ నవంబర్ 30న ఉదయం 10:35 గంటలకు మదనపల్లి పట్టణంలో “కృతజ్ఞత ర్యాలీ” నిర్వహించనున్నట్లు విలేకరుల సమావేశంలో తెలిపారు. దశాబ్దకాలం పాటు తన వెంట నడిచి, పార్టీ కోసం కృషి చేసి, ప్రతి అడుగులో తోడ్పాటున అందించిన జనసేన శ్రేణులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. జిల్లా లీగల్ జిల్లా అధ్యక్షుడు అమర్ నారాయణ మాట్లాడుతూ, ఏపీ ఈసీ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టిన అనంతరం మైఫోర్స్ మహేష్‌కు అభినందన సూచకంగా ఈ ర్యాలీని నిర్వహిస్తున్నామని తెలిపారు. 30న ఉదయం 10:30 గంటలకు మదనపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని ఏపీఐఐసీ ఆఫీస్ వద్ద నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందని చెప్పారు.

ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో విశాలంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ర్యాలీ విజయవంతం కోసం ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. చిత్తూరు జిల్లా లీగల్ జిల్లా అధ్యక్షుడు అమర్ నారాయణ, రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిని, కుప్పం నియోజకవర్గ ఇన్చార్జ్ నరేష్, మైఫోర్స్ అధ్యక్షుడు ఉమేష్, తంబళ్లపల్లి నాయకుడు హరినాథ్, మదనపల్లి సీనియర్ నాయకురాలు జయ భవ్య కిషోర్ తదితరులు ఈ కమిటీలో ఉన్నారు. అలాగే ఆర్గనైజింగ్ కమిటీలో మైఫోర్స్ డైరెక్టర్ హరిబాబు, జనసేన నాయకులు రామ్మూర్తి, మైఫోర్స్ స్పోర్ట్స్ చైర్మన్ మహేంద్ర, ఉపాధ్యక్షులు నితిన్, ఫాజిల్ ఖాన్ మరియు పలు నియోజకవర్గ ఇన్చార్జ్‌లు సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. ఫుడ్ కమిటీలో వంశీ, ప్రసన్న, నిఖిల్ రామ్, జయంత్, నిఖిల్ బాధ్యతలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జనసేన తంబళ్లపల్లి నియోజకవర్గ నాయకుడు సద్దికుంట రఘునాథ్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి దశాబ్దకాలం పాటు మహేష్‌తో పనిచేసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా హాజరుకావాలని కోరారు. సీనియర్ నాయకురాలు జయ భవ్య మాట్లాడుతూ, ర్యాలీ ఏపీఐఐసీ ఆఫీస్ నుంచి అంబేద్కర్ సర్కిల్, సిటిఎం రోడ్, టౌన్ బ్యాంక్ సర్కిల్, బస్టాండ్, కృష్ణదేవరాయ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, మార్కెట్ యార్డ్ మీదుగా పార్టీ కార్యాలయం వరకు కొనసాగుతుందని వివరించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com