Logo
Date of Publish : 23 December 2022, 3:12 pm
Editor : Sake Naresh

జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా సుండుపల్లె మండలంలో ఎడ్ల బండ్ల ద్వారా ర్యాలీ

              రాజంపేట ( జనస్వరం ) : రైతుల సంక్షేమమే జనసేన పార్టీ లక్ష్యమని జనసేన నాయకులు రామా శ్రీనివాస్ తెలిపారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా సుండుపల్లె మండలంలో ఎడ్ల బండ్ల ద్వారా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సుండుపల్లి మండల కేంద్రంలో రైతులను ఘనంగా సన్మానించారు. అలానే కేక్ కట్ చేసి ప్రజలందరికీ పంచి పెట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం జనసేన పార్టీ అన్నివేళలా అండగా ఉంటుందనీ తెలియజేశారు. చనిపోయిన 3000 మంది రైతు కుటుంబాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం చేయడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓర్వలేక అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు అండగా ఉంటుందని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మచ్చ లక్ష్మీనారాయణ, వంటేరు రాజా, సలీం, రఫీక్,వీరమహిళ రెడ్డిరాణి, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com