రాజోలు, (జనస్వరం) : గత మరియు ప్రస్తుత ప్రభుత్వాల అధికారులు, ప్రజాప్రతి నిధుల ఆదరణకు నోచుకోని ఆర్హులైన పెన్షన్ దారులు గతంలో లబ్ది దారులు ప్రభుత్వ అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగిన కనికరించని ప్రజా ప్రతనిధులు. వారి బాధను, ఆవేదనను గుర్తించి నేను ఉన్నాను అని దైర్యాన్నీ ఇచ్చి వారికి న్యాయం చేయాలని పట్టుదలతో శ్రమించి ప్రభుత్వ వైద్యులను సంప్రదించి జిల్లా స్థాయి అధికారుల ద్వారా లబ్ది దారులకు ప్రభుత్వము నుండి రావాల్సిన పింఛన్ల ను సకాలంలో వచ్చేలా పట్టు వదలని విక్రమార్కుడిలా కృషి చేసి జనసేన పార్టీ వైస్ ఎంపీపీ శ్రీ ఇంటుపల్లి ఆనంద రాజు వారందరికీ పెన్షన్ వచ్చేటట్లు చేయడం జరిగింది.