
రాజోలు, (జనస్వరం) : తూర్పుగోదావరి జిల్లా, రాజోలు నియోజకవర్గం రాజోలు మండలం చింతలపల్లి గ్రామంలో మండల ప్రజా పరిషత్ నిధులతో రాజోలు జనసేనపార్టీ వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు మొట్టమొదటిగా 5 లక్షల రూపాయలు నిధులతో కొత్త రోడ్లుకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమములో గ్రామ సర్పంచ్ మట్టా ప్రసన్న సురేష్, అలాగే జనసేన ఎంపిటిసిలు అడబాల శ్రీనివాసరావు, కుడుపూడి మల్లేశ్వరి, పున్నం నాగ దుర్గ, ఎంపిటిసి మార్లపూడి ప్రసాద్, ఉప సర్పంచ్ బొక్క రామకృష్ణ, వార్డ్ నెంబర్లు, పంచాయతీ సెక్రటరీ ఐ. శుభాకర్, పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.